ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, గూడెం గ్రామానికి చెందిన గద్దల దుర్గాప్రసాద్ బిఆర్ ఎస్ పార్టీకార్యకర్త గత 3నెలల రోజుల క్రితం సిరిసిల్ల నుండి ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుండి జారిపడి మరణించారు. అతనికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున అతని భార్య సుజాతకి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చేతుల మీదుగా 2, లక్షల రూపాయల ఆర్డర్ కాఫీనీ ఇప్పించారు. ఈకార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, విద్యార్థి విభాగం నాయకులు కోల అక్షయ్ గౌడ్ పాల్గొన్నారు.
