
జగదేవపూర్ మండలములోని పలు గ్రామాలలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని…ప్రభుత్వం తరుపున పరిహారం ఇచ్చి ఆదుకుంటామని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు,మండలం లోని ఆనంతసాగర్,తిమ్మాపూర్ గ్రామాల్లో స్థానిక సర్పంచ్ లు లావణ్య మల్లేశం,లక్ష్మీ రమేష్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి పర్టించారు, వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కుమార్,మహేందర్, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.




