ప్రాంతీయం

ఆశా వర్కర్లకు కనీస వేతనాలివ్వాలి

144 Views

ఆశా వర్కర్లకు కనీస వేతనాలివ్వాలి

దుబ్బాక మండలం రామక్క పేట, తిమ్మాపూర్ PHC ల నుండీ CITU ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు వెళుతున్న ఆశా వర్కర్లు ఈ సందర్భంగా CITU రాష్ట్ర కమిటీ సభ్యులు జి. భాస్కర్ మాట్లాడుతు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 26వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారనీ గత 18 సం॥రాల నుండి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు. పారితోషికాల పనితో పాటు పారితోషికాలు లేని అనేక అదనపు పనులు ఆశాలు చేస్తున్నారనీ కంటి వెలుగు, లెప్రసీ తదితర పనులు చేస్తున్నారనీ తెలిపారు. పనిభారం గతంతో పోలిస్తే అనేక రెట్లు పెరిగిందనీ కానీ ఇన్ని పనులు చేస్తున్న ఆశాలకు నేటికీ ఫిక్సిడ్ వేతనం అమలు చేయడం లేదని విమర్శించారు. పెన్షన్, ఇ.ఎస్.ఐ, ఉద్యోగ భద్రత,కనీసం ప్రసూతి సెలవులు కూడా ప్రభుత్వం నేటికీ నిర్ణయం చేయలేదనీ అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశాలకు రూ.10,000/- లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలనీ డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం 26000 రూ,, లు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందనీ అన్నారు. కావున రాష్ట్రంలో పని చేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయాలనీ డిమాండ్స్ చేశారు.ఈ కార్యక్రమంలో CITU దుబ్బాక టౌన్ కాన్వినర్ కొంపెల్లి భాస్కర్, ఆషా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, భాగ్యలక్ష్మీ, చెంద్రకళా,శ్యామల, శోభ, దేవలక్ష్మీ,రజిత,మమత, అనిత తదితులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *