అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కేట్ కమిటీ ద్వారా గుర్తింపు పొంది లైసెన్స్ కలిగిన 69 మంది హమాలి కార్మికులకి బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరై వారికి అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, కర్షకలోకానికి మేడే శుభాకాంక్షలు తెలపడం జరిగింది.మేడే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతున్నదని స్పష్టం చేశారు.
వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టి జరుగుతున్నదని అన్నారు. తద్వారా, రాష్టాభివృద్ధి ,దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని విషయాన్ని వారు గుర్తు చేశారు. ఎందరో మహానుభావులు నెత్తిరోడి సాధించుకున్న హక్కుల ఫలితమే ఈరోజు మనం మేడే గా జరుపుకుంటున్నాం అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కార్మికుల సంక్షేమనికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ వారి శ్రమను గుర్తించి వేతనాలు పెంచిన విషయాన్నీ వారు తెలిపారు. కార్మికులంతా సంఘటితంగా ఉండి శ్రమశక్తిని ఎలుగెత్తి చాటాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మార్కేట్ సెక్రెటరీ జాన్వెస్లీ , సూపర్వైజర్ మహిపాల్, డైరెక్టర్లు, భాస్కర్ రెడ్డి, మతిన్, ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు సాయిరెడ్డి, రమేష్ గౌడ్, మార్కెట్ సిబ్బంది, హమాలి కార్మికులు పాల్గొన్నారు.