ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16, మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో తమ పోరాటాల ఫలితంగానే ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల మంజూరు అయిందని ముస్తాబాద్ లో డిగ్రీ కళాశాల మంజూరు అయ్యేంతవరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు… ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ మాట్లాడుతూ మండలానికి చెందిన ఎంతోమంది నిరుపేద విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లలేక చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ముస్తాబాద్ కు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు..
