ప్రాంతీయం

సిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి.

59 Views

సిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి.

భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయకపొవడం అన్యాయం

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు మరియు మాజీ సిఎం కెసిఆర్ ,మాజి మంత్రులు 

సిద్దిపేట జిల్లా జనవరి 22

సిద్దిపేట జిల్లా  మల్లన్నసాగర్ భూ నిర్వాసిత కాలనీ లలో పర్యటించి వారి గోస వినాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో ఎర్రవళ్ళి నిర్వాసిత కాలనీలో వివిధ నిర్వాసిత కాలని బాధితులతో సమావేశం అనంతరం అంబేద్కర్ విగ్ర ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు దామొదర్,కొండ సురేఖ,పొన్నం ప్రభాకర్ లు భూ నిర్వాసిత కాలనీలలో పర్యటించి నిర్వాసితుల బాధలు విని పరిష్కరించడానికి చొరవ చూపాలని కోరారు. మాజీ సిఎం కేసిఅర్,మాజి మంత్రి హరిష్ రావులు నిర్వాసితుల సమస్యలకజ కారకులన్నారు.రాష్ట్రoలో వివిధ సమస్యల పై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి హరిష్ రావు నిర్వాసితుల సమస్యల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించక పొవడం దారుణమన్నారు.మల్లన్న సాగర్ లో 5,212 కుటుంబాలలో ఉపాధి హమీ జాబ్ కార్డు లు వున్నప్పటికి పనులు చూపలేదన్నారు.మల్లన్న సాగర్ ప్రాజెక్టు కు భూములు స్వాధీనం చెసుకొవడంతో భూమిలెని వారుగా మారరన్నారు.ఉపాధి హమి పనులు చూపించక పొవడంతో పని లేక పస్తులు వుండాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు.భూములు లేనందున ఉపాధి హమి పనిదినాల షరతును తొలగించి నిర్వాసితులందరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పధకాన్ని అమలు చెసి అదుకొవలన్నారు. పెండింగ్ లో వున్న ఒంటరి మహిళలకు,యువజనులకు అర్ అండ్ అర్ ప్యాకేజి ని అమలు చెయాలన్నారు.

ప్రభుత్వం స్పందించకుంటె 27 నుండి నిర్వాసితుల దీక్షలు

జనవరి 26 నాడు భూ నిర్వాసితులకు ఇందిరమ్మ అత్మీయ భరోసా అమలు చేయకుంటె ఈ నెల 27 నుండి ఎర్రవల్లి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన దీక్షలు చెస్తామని డిబిఎఫ్ నేతలు శంకర్,ఎగొండ,వేణులు తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లిస్డులలో రాష్ట్ర వ్యాప్తంగా భూములు వున్న వారి పేర్లు వస్తుండటం సిగ్గు చెటన్నారు.సర్వం కొల్పోయిన నిర్వసితులకు మాత్రం అత్మీయ భరోసా అమలు చేయకపొవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమం లో  ముత్యాలమ్మ,లక్ష్మీ, నర్సవ్వ,శివకుమార్,కిషన్,నర్సిములు ,అకారం మలయ్య,ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్