దుబ్బాక: ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించి దగ్ధం చేసిన ఘటన దుబ్బాక పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ పరిధిలోని మల్లాయిపల్లి వార్డు లో శనివారం రాత్రి కేసరి రాజు రోజు మాదిరిగానే తన ఇంటిముందు పల్సార్ బైక్ ను పార్క్ చేసి పడుకున్నారు. అయితే అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ కు నిప్పు పెట్టి దగ్ధం చేసినట్లు ఆరోపించారు. పెద్ద శబ్ధం రావడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే పెద్ద పెద్ద మంటల్లో అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. బాధితుడు కేసరి రాజు పిర్యాదు మేరకు దుబ్బాక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.
