తొగుట; అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తూ..మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొండంత భరోసా ఇస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు..మండలంలోని వెంకట్రావుపేటలో మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గార్ల సహకారంతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లక్ష్మీనర్సవ్వ కు రూ 16,000, బెజ్జనమైన రాధకు రూ.11000 చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్యంకు పెద్ద పీట వేస్తుందన్నారు.. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు, సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలా కృషి చేస్తున్నారన్నారు. మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య సేవలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు అందించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ సేవలు పొందిన వారికి సైతం సీఎం సహాయనిది ద్వారా ఎల్ఓసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల ఎంపిటిసీల ఫోరంఅధ్యక్షులు కంకణాల నరసింహులు, సర్పంచ్ పాత్కుల లీలాదేవి వెంకటేశం, ఆత్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సుతారి రాములు, ఈదుగల్ల పర్శరాములు, నాయకులు పాత్కుల బాలేష్, బెజ్జనమైన ఎల్లం, శివకోటి తదితరులు ఉన్నారు..
