ప్రాంతీయం

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి

120 Views

తొగుట:వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని తొగుట, రాంపూర్ గ్రామాల్లో ఐకేపీ, సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను సొసైటీ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లతో కలిసి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె.పేర్కొన్నారు.. సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లు మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అకాల వడగండ్ల వర్షంతో మండలంలోని పలు గ్రామాల రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నష్ట పోయిన ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామన్నారు..సీఎం కేసీఆర్ కృషి తో సాగునీళ్లు, కరెంటు సరఫరా అందడంతో..పెద్ద ఎత్తున పంటలు సాగుచేయడం జరుగుతుందన్నారు..చివరి గింజ వరకు వరిధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు..కార్యక్రమంలో ఏవో మోహన్, ఐకేపీ ఏ.పి.ఎమ్ ముగ్దుమ్ అలీ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు బోధనం కనకయ్య, మార్కెట్, సొసైటీ వైస్ చైర్మన్లు కంది రాంరెడ్డి, కుర్మ యాదగిరి, సర్పంచ్ పాగాల కొండల్ రెడ్డి, ఎంపీటీసీ సుతారి లలిత రమేష్, డైరెక్టర్లు నరేందర్ గౌడ్, బాల్ రెడ్డి, సంతోష్ యాదవ్, అనిల్, ఎన్నాం మహిపాల్ రెడ్డి, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు స్వప్న, సీసీ వరలక్ష్మి, సీ ఏ లావణ్య, దేవవ్వ నాయకులు ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *