జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ బాలేశం గౌడ్ అధ్యక్షతన ఎంపీడీవో సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమంచేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశం గౌడ్, డా. రాజశేఖర్ మాట్లాడుతూ ఇటీవల గత కొద్ది కాలంగా ఎక్కువ మంది గుండె నొప్పి తో మరణిస్తున్నారని, గుండె నొప్పి అనేది ఏ వయస్సు అనేది తేడాలేకుండా, ఎవ్వరికి చెప్పి రాదు అని అలాంటి ప్రమాదం లో ఉన్న వ్యక్తు లని వెంటనే రక్షించాలంటే సిపిఆర్ చేయడం పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.డా. రాజశేఖర్ పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి గుండె నొప్పి వఛ్చిన వారిని సిపి ఆర్ చేసి ప్రాణాలను ఎలా రక్షించవచ్చని ప్రయోగ శిక్షణ ద్వారా అవగాహన కల్పించారు. ఎంపీపీ బాలేశం గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలతో కలసి పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు తప్పకుండ సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండి గుండె నొప్పి తో ఎవరైనా భాధ పడుతుంటే ధైర్యం తో సిపి ఆర్ చేసి ప్రాణాలను రక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, మండల్ కో అప్షన్ సభ్యులు సయ్యద్ ఎక్బల్, ఎస్ ఐ యం. కృష్ణ మూర్తి, తహసీల్దార్ రఘువీరారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మజార్, జూనియర్ అసిస్టెంట్ అనిత, యాదయ్య, పంచాయతి కార్యదర్శులు తిరుపతి, మల్లేశం, కృష్ణ రెడ్డి, సతీష్, ఈ పంచాయతీ ఆపరేటర్ లు చిలుముల కృష్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.