ముస్తాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11, ముస్తాబాద్ మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన ఉద్యమ పితామహులు మహాత్మ జ్యోతిబాపూలే196,వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే ఈదేశంలో ఉన్న అణగారిన వర్గాలకు అనగా ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య దూరమున్న సందర్భంలో ఆయన చదువు నేర్చుకొని ఆయన భార్య సతీమణి సావిత్రిబాయి పూలే చదువు నేర్పించి ,వారికి పిల్లలు కాకుండా పసరు మందు తాగి ఈదేశ ప్రజల కోసం త్యాగంచేసి ఈదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విద్యను నేర్పించారు. ముఖ్యంగా వంటింటికి పరిమితం అయిన స్త్రీలకు విద్య నేర్పి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఆయన త్యాగాలే ఈదేశంలో ఉన్న బహుజనుల బ్రతుకులు మారడానికి కారణమని ఈదేశంలో అన్ని జాతులు సమానంగా బతకాలంటే విద్యనే ఏకైకమార్గం పనిచేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అన్నారు. ఆయన ఆలోచనలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించి భారత రాజ్యాంగం రూపంలో ఈదేశ ప్రజలకు ఆయన కూడా అందించారు. ఆ మహనీయుల ఆలోచనలను నెరవేర్చడం కోసం మాన్యవార్ కాన్షిరాం బహుజన సమాజ్ పార్టీని నిర్మించాడు ఆ మహనీయులు కలలుగన్న ఆశయాలను బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే సాధ్యం చేయగలుగుతుందని బహుజన రాజ్యం స్థాపించిన రోజే ఆ మహనీయులు కలలుగన్న కలలను నిజం చేసుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు జోగిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొమ్మేట వెంకటేష్, కార్యదర్శి ధోనుకుల నరేందర్, కోశాధికారి హరిబాబు, ఈసీ నెంబర్లు రవి ప్రదీప్, సంతోష్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు సుంచు అరుణ్, మొఱ్ఱయిపల్లె గ్రామ అధ్యక్షులు కుమార్, స్వేరోస్ టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ స్వేరో , మచ్చ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
