ప్రాంతీయం

పూలే బాటలో సీఎం కేసీఆర్

103 Views


తొగుట: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. తొగుటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 197వ పూలే జయంతి కార్యక్రమం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. 18వ శతాబ్దంలో అంటరానితనం, విద్యా వివక్ష మీద అలుపెరుగని పోరాటం సాగించాడన్నారు. ఆయన స్పూర్తితో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల్లో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు.
రజకులకు, నాయి బ్రాహ్మణులకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు,
బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, గీత, చేనేత, మత్స్య కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు… బీసీల వికాసానికి బీసీ గురుకులాలు, గొర్రెల పంపిణీ, బెస్త, ముదిరాజుల ఉపాధి కోసం చెరువుల్లో చేపల పెంపకం, రజకులకు ఆధునిక
లాండ్రీ యంత్రాలు, ధోబీఘాట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు..సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోమల కొమురయ్యలు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు గురుకుల విద్య తోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.. తెలం గాణ ప్రభుత్వ కృషి వెనుక మహాత్మా ఫూలే ఆదర్శాలు, ఆశయ సాధన లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో సాధిస్తున్న విజయాలు దేశానికి ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో భారత సమాజంలో అన్ని రంగాల్లో అన్నివర్గాలకు సమానత్వం ఆవిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తన కార్యాచరణను కొనసాగిస్తూనే ఉంటుందని
స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల సర్పంచుల, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సిరినేని గోవర్ధన్ రెడ్డి, కంకణాల నర్సింలు, కోఆప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, మార్కెట్, సొసైటీ వైస్ ఛైర్మన్లు కంది రాంరెడ్డి, కుర్మ యాదగిరి, ఎంపీటీసీ వేల్పుల స్వామి, మండల యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, నాయకులు పన్యాల ఎల్లారెడ్డి, కుంభాల శ్రీనివాస్, ఎం చంద్రారెడ్డి, సుతారి రమేష్, బక్క కనకయ్య, మంగ నర్సింలు, మెట్టు స్వామి, ఎల్లం,
మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నరేందర్ గౌడ్, పర్శరాములు, సంతోష్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు తగరం అశోక్, వెంకట్ గౌడ్ , జంగిడి భిక్షపతి, బోయిని శ్రీనివాస్, చిక్కుడు రమేష్, బైరాగౌడ్, బైరారెడ్డి, భాస్కర్ గౌడ్, ఆంజనేయులు, వెంకటేశ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *