జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించరు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించరు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అట్కూరి రాములు బండారుదేవేందర్ మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఎంతోమంది చరిత్ర పురుషులకు స్ఫూర్తి ప్రదాత అయిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి నేడు.1827లో మహారాష్ట్రలో జన్మించిన ఆయన నాటి సమాజంలో స్వైర విహారం చేస్తోన్న కుల రక్కసిని ప్రారదోలాటానికి ఎంతగానో శ్రమించారు.సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి స్త్రీవిద్య, సాంఘిక దురాచారాల నిర్మూలన, కుల వ్యవస్థ నిర్మూలన లాంటి ఎన్నో కార్యక్రమాలను ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చారు.నాటి సమాజంలో స్త్రీ విద్య ఒక నేరంగా పరిగణించబడేది.మహిళలను విద్యకు దూరంగా ఉంచాలని సాంఘిక దురాచారపు సంకెళ్లను.తెంచివేస్తూ తన జీవన సహచరి సావిత్రిబాయి పూలేకు తానే గురువుగా మారి ఆమెను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఎంతోమంది మహిళలకు సావిత్రి భాయి చే విద్యను నేర్పించారు.ఆధునిక భారతదేశ చరిత్రలో సావిత్రిబాయి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా నిలిచిపోయారు.మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను పరిపూర్తి చేసే క్రమంలో ప్రతి ఒక్కరు పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉంది.కుల రహిత భారతదేశం ఆవిష్కృతం అయ్యే దిశలో ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం దళిత నాయకులు కౌన్సిలర్ బొగ్గులచందు. అంబేద్కర్ సంఘం నాయకులు బొల్లారం ఎల్లయ్య. మన్నె కృష్ణ. నర్సింలు. బైరం శివకుమార్. ఎల్లయ్య. మైస స్వామి. నర్సింలు తదితరులు పాల్గొన్నారు
