74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరై జాతీయ పతాకావిష్కరణ గావించారు. ముందుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత మరియు జిల్లా కలెక్టర్ వేరువేరుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్, శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అడిషనల్ డిసిపి మహేందర్, కలెక్టరేట్ ఏవో రెహమాన్,కలెక్టరేట్ సిబ్బంది. వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితదితరులు పాల్గొన్నారు.
