ప్రాంతీయం

మోడీ సభను విజయవంతం చేయండి

99 Views

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి

ఈ నెల 4న ఆదిలాబాద్ లో జరబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లాకు మొదటి సారిగా వస్తున్న ప్రధానమంత్రి కి స్వాగతం పలుకుతున్నామన్నారు. ఈ సభకు ప్రజలు ,బీజేపీ కార్యకర్తలు మరియు నాయకులు అధికసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కొప్పు భాష,పార్లమెంట్ కో కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ఆదిలాబాద్ మాజీ ZP ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, చెన్నూర్ నియోజకవర్గ ప్రభారి పుప్పాల శివాజీ,దుర్గం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్