తొగుట: దేశంలోనే నేడు సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.. మండలంలోని ఎల్లారెడ్డిపేట, ఘనపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు తెలంగాణ ప్రజలు కన్న కలలను సాకారం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికె దక్కుతుందన్నారు ..తెలంగాణ సాధించుకునే వరకు అభివృద్ధి సంక్షేమంలో మనం ఎంతో నిర్లక్షానికి గురయ్యమని, నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు ..తెలంగాణ రాకముందు మనం పడ్డ సాగు, తాగు నీటి గోసలు, కరెంటు కష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.. ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణకు వచ్చి ఇక్కడి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి సంబుర పడుతుంటే..మన ప్రతిపక్ష నాయకులు మాత్రం ఓర్వలేక..ఈర్ష ద్వేషాలకు లోనై.. ప్రభుత్వం ను బదునాము చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలంగాణలో చెపడుడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకొని మారుపేరు తో..వివిధ రాష్ట్రాలలో కార్యక్రమాలు చేపడుతున్నారని ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు…
ప్రజల్లో గెలువలేక పక్కదారుల్లో దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల కుట్ర, కుతంత్రాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ చేదించాలని, తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు..ఎల్లారెడ్డి పేట, ఘనపూర్ గ్రామాలు మొదటి నుండి బీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్నాయన్నారు ..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సారధ్యంలో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం అందించాలని కోరారు.. మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో తృటిలో ఓటమి పాలయ్యామని, నేడు పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు రైతుబంధు, రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అర్హులైన వారికి పెన్షన్, లాంటి ఎన్నో పథకాలతో సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.. ఎల్లారెడ్డిపేటలో బూత్ అధ్యక్షులుగా కనికి బయన్న భాస్కర్, మన్నె కనకరాజు, సోషల్ మీడియా కన్వీనర్లు గా బుర్ర ఎల్లాగౌడ్, మన్నె బలరాజులను, ఘనపూర్ లో బూత్ కన్వీనర్లు గా మరుపల్లి మల్లేశం గౌడ్, యాటెల్లి గణేష్, సోషల్ మీడియా కన్వీనర్ గా చెన్నారెడ్డి రాజిరెడ్డి లను ఎన్నుకున్నారు. అలాగే 100 ఓట్లకు ఒక ఇంఛార్జీలను లను ఎన్నుకున్నారు..
వీరికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో. సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సిరినేని గోవర్ధన్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య, కో అప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి, ఎంపీటీసీలు వేల్పుల స్వామి, కొమ్ము శరత్, మాజీ పార్టీ మండల అధ్యక్షుడు కుంభాల శ్రీనివాస్, మండల యువజన అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకట్, అక్కం స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నందారం నరేందర్ గౌడ్, కొమ్ము కిషన్, నాయకులు బుర్ర నర్సింలు, వేముల యాదగిరి, గంట రవీందర్, దేవునూరి పోచయ్య, కొమ్ము రాజశేఖర్, యాటెల్లి రాజు, కుమారస్వామి, ఉప్పునూతల రామస్వామి, మోహినోద్దీన్, కుంభాల రామస్వామి తదితరులు పాల్గొన్నారు…
