అక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7
అక్టోబర్ 15 న మంచిర్యాలలో గద్దర్ సంస్మరణ సభ!కరపత్రాలు విడుదల చేసిన ఆహ్వాన సంఘం నాయకులు.
రానున్న ఆదివారం రోజున మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరియు పాత్రికేయులు జహీరుద్దీన్ అలీ ఖాన్ గార్ల సంస్కరణ సభను ఏర్పాటు చేశామని ఆహ్వాన సంఘ కమిటీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంచిర్యాలలో బుధవారం రోజున వారు కరపత్రాల విడుదల చేశారు .
తెలంగాణ సాంస్కృతిక యోధుడు గద్దర్ మరియు భారత్ బచావో రాష్ట్ర కమిటీ చైర్మన్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గారి సంస్మరణ సభ ఆదివారం రోజున సిసిసి షిర్కే కాలనీ ప్రెస్ క్లబ్ లో ఉ. 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని వారు తెలిపారు.
తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక ఆకాంక్షల రూపంగా నిలిచిన గద్దర్ ను సంస్మరించుకోవడం ద్వారా ఆయన అందించిన వారసత్వాన్ని కొనసాగించాలని వారు తెలిపారు. తెలంగాణలో బడుగుల సంక్షేమం నెలకొల్పే వ్యవస్థ రావాలని గద్దర్ కోరుకున్నారని వారు తెలిపారు.
ఈ సంస్మరణ సభలో భారత్ బచావో జాతీయ కార్యదర్శి గాదె ఇన్నయ్య, ప్రముఖ బహుజన వాది జేబీ రాజు, భారత్ వాచావో రాష్ట్ర నాయకులు జయసింగ్ రాథోడ్, ఉస్మానియా జేయేసి నాయకులు దుర్గం భాస్కర్ మంచిర్యాల జిల్లాలోని ప్రజాఉద్యమ కారులు పాల్గొంటారని వారు తెలిపారు. గద్దర్ సంస్మరణ సభకు అన్ని వర్గాల ప్రజలు, సింగరేణి బిడ్డలు హాజరుకావాలని వారు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారత్ బచావో మంచిర్యాల జిల్లా చైర్పర్సన్ కనుకుంట్ల మల్లయ్య, బీసీ ఐక్య వేదిక కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్,సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, సింగరేణి బీసీ సంఘర్షణ సమితి నాయకులు సమ్ము రాజన్న, మాడిశెట్టి విశ్వం, నూతన్ కుమార్ మరియు బొద్దున భూమయ్య తదితరులు పాల్గొన్నారు.






