ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 1, ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంత్రి కేటీఆర్ సౌజన్యంతో గివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా వచ్చిన ప్యాడ్లు , పెన్నులను 10వ తరగతి విద్యార్థులకు రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావుతో పాటు ప్రజాప్రతినిధుల, చేతుల మీదుగా అందించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు తోటి విద్యార్థిని, విద్యార్థులకు గౌరవప్రదంగా మెదలాలి మంచి మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు గురువులకు మండలం లోని గ్రామాలకు మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులందరు మెరుగైన మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలని వారన్నారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈసరి రవీందర్, జెడ్పిటిసి గుండం నరసయ్య, సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎంపిటిసి కంచం మంజుల నర్సింలు, బారాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
