దౌల్తాబాద్: నూతన సంవత్సర వేడుకలను మండల ప్రజల నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డీజే లకు అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు..
