ప్రాంతీయం

వీడియో గ్రాఫర్స్ షెడ్యూల్ ప్రకటించారు…

430 Views

ముస్తాబాద్, డిసెంబర్15 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల యొక్క ఆరోగ్యం, ఆర్థిక, విలువల దృష్ట్యా ఫోటోగ్రఫీ రంగంలో సమూల మార్పుల కొరకు ముస్తాబాద్ చుట్టుపక్కల గల వివిధ జిల్లాలోని మండలాలు అయినటువంటి దుబ్బాక, గంభీరావుపేట్, ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, రామాయంపేట, కొనరావుపేట్ లాంటి వివిధ మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని వృత్తుల వారికి సమయపాలన ఉంటుంది కానీ ఫోటోగ్రాఫర్లకు సమయపాలన లేకుండా రాత్రి పగలు తేడాలేకుండా పనిచేస్తున్నారు, రాత్రి నిద్ర లేకుండా పనిచేయడం వలన ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతున్నారు. అంతేకాకుండా నిద్రలేకుండా వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి తీవ్రగాయాల పాలు అవుతున్నారు, కొందరు చనిపోతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైన సమయపాలన పాటించాలని నిర్ణయించడం జరిగింది.
ఒకరోజుని రెండు షెడ్యూల్స్ గా చేశారు. మొదటి షెడ్యూల్: ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు,
రెండోవ షెడ్యూల్: సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12 గంటల వరకుగా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ రాత్రి 12 గంటలు దాటినా తర్వాత కూడా ప్రోగ్రాం తీయాలంటే అదనంగా విసిట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని అన్ని మండలాల ఫోటోగ్రాఫర్లు నిర్ణయించి ఆమోదించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *