üవేములవాడ – జ్యోతి న్యూస్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తెరాస ప్రభుత్వం యొక్క దోపిడిని ప్రశ్నిస్తరనే భయంతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తు ముగ్గురు బిజెపి ఎమ్మెల్యే లను అసెంబ్లీ నుండి అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వేములవాడ పట్టణ బిజెపి అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వ దిష్టి బొమ్మను సోమవారం దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, గోడిసెల శ్రీనివాస్, అన్నరం శ్రీనివాస్, రామతీ ర్తపు హరీశ్, పిన్నింటి హనుమండ్లు, గుడిసె మనోజ్ , మొగిలి మహేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.