Breaking News

రాష్ట్ర స్థాయిలో స్వఛ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆవార్డ్ – 2023.

100 Views

హైదరాబాద్ సెప్టెంబర్ 14: రాష్ట్ర స్థాయిలో స్వఛ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆవార్డ్ – 2023 కు ఎంపికైన వేంపల్లి గ్రామ పంచాయితీ.

రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఆవార్డు అందుకున్న వేంపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ డోలే లక్ష్మి.

హైదరాబాద్ లో ఈ రోజు రాజేంద్ర నగర్ లో ఏర్పాటు చేసిన స్వఛ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆవార్డ్స్ – 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఎంపికైన గ్రామ పంచాయితీ సర్పంచ్ లను సన్మానించి ఆవార్డులను అందజేశారు.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని సిర్పూర్ మండలం వేంపల్లి గ్రామ పంచాయితీ పల్లె ప్రగతి, హరితహరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మరియు గ్రామంలో జరిగిన అభివృద్ధికి గాను రాష్ట్ర స్థాయి స్వచ్చ భారత్ మిషన్ గ్రామీణ అవార్డ్ కు ఎంపికైంది.

వేంపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ డోలే లక్ష్మిని శాలువాతో సత్కరించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఆవార్డును అందుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *