Breaking News

రోడ్డెక్కిన మోచి చర్మకారుల సంఘం

187 Views

రోడ్డెక్కిన మోచి చర్మ కారుల సంఘం..

సమాధులు కూల్చిన కమిషనర్ పై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి…

రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం పిలుపు మేరకు ధర్నా, రాస్తారోకో…
ప్రజా పక్షం ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్(జగదీశ్వర్)

వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి వద్ద రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం పిలుపు మేరకు గురువారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈనెల 19న వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో గల మోచి స్మశాన వాటిక లోని సమాధులను వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు అక్రమంగా సమాధులను ధ్వంసం చేసినారు అని ఆరోపించారు. సమాధులను ధ్వంసం చేసిన ఘటన చూసిన కుల సంఘం సభ్యులు ఇది మా పూర్వక సమాధులు వాటిని ఎందుకు ఇదంతా చేస్తున్నారని ప్రశ్నిస్తే కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించి నెట్టివేశారు. కులం పేరుతో దూషించిన మున్సిపల్ కమిషనర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో సి ఐ కి ఫిర్యాదు చేసిన కానీ ఇప్పటివరకు కమిషనర్ పై ఇలాంటి కేసు నమోదు చేయలేదని, ఈ సంఘటనపై నిరసనగా గురువారం మూలవాగు బ్రిడ్జి పైన సుమారు 400 మంది మోచి సభ్యులతో మహా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ,కార్యదర్శులు గంగాధర్, బాలకృష్ణ ,ముత్యం లు మాట్లాడుతూ కులం పేరుతో దూషించిన కమిషనర్ పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని మోచి సంఘం పక్షాన వారు డిమాండ్ చేశారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కూల్చిన వారి పూర్వీకుల సమాధులను పునర్నిర్మించాలని కోరారు. లేని పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోచి కులస్తులు అందరినీ ఏకం చేసి అంబేద్కర్ చూపిన బాటలో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కులం పేరుతో దూషించడం కమిషనర్ స్థాయి అధికారి కి తగునా అని ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉండాలని మహానుభావుడు ఆశయసాధనలో అధికారులు ఆయన ఆశయాలను కాల రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాస్తారోకో, ధర్నా తో నిలిచిపోయిన వాహనాలు…

మోచి సంఘం నాయకులు చేపట్టిన మహా ధర్నా, రాస్తారోకో సుమారు గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా నిర్వహిస్తున్న వారిని పోలీస్ వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు .అక్కడే ఉన్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో స్థానిక అధ్యక్షులు ఓటరికారి లక్ష్మీరాజ్యం, రాష్ట్ర నాయకులు రామచంద్ర, సుధాకర్, కావల శ్రీనివాస్, ప్రభాకర్ జీవన్ సింది విజయ్ కుమార్ రాజేందర్, బిక్షపతి ,శ్రీనివాస్, భూమేష్, బాలయ్య, గోపి, ముఖేష్ ,సత్యం, సాయిలు ,రాజు, రాములు, భూమయ్య, గంగాధర్, భూషణం, నారాయణ, రామచంద్రం, మహేష్ తోపాటు మోచి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్