కోనరావుపేట/ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనంగా ఏర్పడిన గొల్లపల్లె గ్రామపంచాయతీ జిల్లాలో నూతన ఏర్పడిన గ్రామాలలో గొల్లపల్లె గ్రామం మొట్టమొదటి జిపి భవనం పూర్తి కాగా 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్పర్సన్ అరుణ రాగవరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోపు పర్శరాములు, ఫ్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, ఎంపిడిఓ రామకృష్ణ, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, వంగపల్లి శ్రీనివాస్,ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
