బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా స్వాగతిస్తున్నామన్నారు కానీ ఈ పనుల గురించి గౌడ సంఘం నేతలు ఎంత గట్టిగా మాట్లాడి పోరాటం చేస్తే ఈ పనులు జరిగాయన్నారు మంత్రి కేటిఆర్ ను గట్టిగా విమర్శిస్తే తప్ప పనులు చేయడం లేదన్నారు దళిత బంధు బీసీ బందు మైనార్టీ బందు క్రిస్టియన్ బంధు ఇలా బందుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ప్రజలు బాగుపడటానికి కోసం డబ్బులు ఇస్తే తమకు అభ్యంతరం లేదని కానీ కులాలలో ఒకరిద్దరికీ ఇచ్చి తగవు పెట్టడం అన్యాయం అన్నారు ఇప్పటివరకు ఇచ్చిన బందులలో కనీసం ఐదు శాతం కూడా ఇవ్వలేదన్నారు కులాల పేరిట సమాజంలో ఒక అడ్డుగోడలు నిర్మాణం చేస్తున్నారని అన్నారు ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ అనడం సమంజసం కాదన్నారు స్వార్థం కోసం చేసే పనులు సమాజాన్ని ఎన్నడూ కూడా ఉద్ధరించలేమన్నారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి పట్టణ అధ్యక్షుడు చిన్ని బాబు పాల్గొన్నారు
