దౌల్తాబాద్: యువత చత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవకులు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, కనక రాములు, ఆంజనేయులు, రాజు, మహేష్, పోచయ్య, సతీష్, స్వామి, నరేష్, హనుమంతు, కరుణాకర్ రెడ్డి, నాగరాజు, హరీష్, శ్రీకాంత్, సురేష్, కార్తీక్, బాల రాజ్ తదితరులు పాల్గొన్నారు…..
