ఇంటర్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్లు మూసివేత
మార్చ్ 01
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే మార్చి 5 నుంచి మార్చి 25 వరకూ జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సి ఎస్, శాంతికుమారి ఆదేశించారు. పరీక్షలు సజావుగా జరగడానికి చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్లకు సలహాలు, సూచనలిచ్చారు. కాపీయింగ్కు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని సి ఎస్ ,అధికారులకు స్పష్టం చేశారు.
