– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
వేములవాడ – జ్యోతి న్యూస్
నేటి నుండి ప్రతి సోమవారం ప్రజావాణి (గ్రీవిన్స్ డే) ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటల నుండి మ. 1.00 గంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.