టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆట, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఎవరి నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి రుజువైంది. ఇన్‌స్టాలో భారత సారథి కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 150 మిలియన్ మార్క్‌ను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి ఆసియా సెలబ్రెటీగా విరాట్ గుర్తింపు పొందాడు. అంతేకాక తొలి భారతీయుడిగా, తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.




