తెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మార్చి 03 :
ఎల్లారెడ్డిపేట
మండలంలోని రాచర్ల గొల్లపల్లి , బొప్పాపూర్ గ్రామాల సరిహద్దులోని శ్రీ సీతారామస్వామి ,శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ వెంకటేశ్వర స్వామి , వార్ల ఆలయాలైన మూడు గుళ్ల ఆలయాల్లో గురువారం ఇరు గ్రామాల పురోహితుల అధ్వర్యంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్లకు శ్రీ ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూర్వా భాద్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు , ప్రత్యేక అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుద్రం,నమక చమకాలతో పుష్పార్చన కార్యక్రమం, ప్రత్యేక పూజాధికాలునిర్వహించారు .మహిళా భక్తులు అధిక సంఖ్యలో పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాచర్ల గొల్లపల్లి గ్రామ పురోహితులు రాచర్ల విద్యాసాగర్ శర్మ, బుగ్గ కృష్ణ మూర్తి శర్మ, బుగ్గ శ్రీనివాస్ శర్మ, రాచర్ల శ్రీనివాస్ శర్మ, సంపత్ కుమార్ శర్మ,
బోప్పాపూర్ గ్రామానికి చెందిన రాచర్ల విశ్వనాథ శర్మ , చిత్కల దంపతులు, కొండపాక శ్రీనివాస్ చారి, రవి శర్మ, ఆలయ పూజారి క్రిష్ణమాచార్యులు పాల్గొని పూజా రుద్రం, నమక చమ కాలతో స్వామి వారికి పూజలు చేయగా ఆలయ కమిటీ సభ్యులు ఆధి మల్లేష్, పెంజర్ల రవి యాదవ్ లతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
