ప్రాంతీయం

బొప్పాపూర్ గ్రామంలో పల్స్ పోలియో ప్రారంభించిన సర్పంచ్

110 Views

రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామం ఆరోగ్య ఉప కేంద్రం లో నేడు పల్స్ పోలియో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొండాపురం బాల్రెడ్డి ప్రారంభించడం జరిగింది, సర్పంచ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోలియో చుక్కలు ఇప్పించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకొని పోలియో వ్యాధిని నివారించాలని, ఇట్టి పల్స్ పోలియో కార్యక్రమం మూడు రోజుల పాటు ( ఫిబ్రవరి 27,28,29) కొనసాగుతుందని తెలిపారు, పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏఎన్ఎం పద్మ, ఆశా వర్కర్లు సుజాత, మరియు అంగన్వాడీ టీచర్లు పద్మ, వెంకటమ్మ తమ విధులను కర్తవ్యంగా నిర్వహిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు
ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంగ హేమలత-బాపురెడ్డి , వార్డు సభ్యులు,బెస్త నరేష్ మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7