ప్రాంతీయం

స్వయం సమృద్ధి తో గ్రామీణ వికాసం అప్పాల ప్రసాద్ సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్

114 Views

toస్వయం సమృద్ధి తోని గ్రామీణ వికాసం సాధ్యపడుతుందని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. తొగుట మండలం ముత్యంపేట గ్రామంలో చేతన గ్రామీణ వికాస సేవా సమితి మరియు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. దాతల సహకారంతో నాలుగు కుట్టుమిషన్ యంత్రాలను పంపిణీ చేయడం జరిగింది. నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి కల్పించి, స్వయం సమృద్ధి వైపు నడిపించడం కోసం ఈ శిక్షణ కేంద్రం ప్రారంభించినట్లు అప్పాల ప్రసాద్ తెలిపారు. కుట్టు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక ట్రైనర్ ఏర్పాటు చేశామన్నారు ఉత్సాహంగా యువతులు మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ తో పాటు సామాజిక సమరసత వేదిక మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రుక్మిణి ,సామాజిక సమరసత వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ అరవింద్ కుమార్, ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, వడ్ల రాజు ,మండల కన్వీనర్ యాదగిరి, లక్ష్మీనారాయణ,చేతన గ్రామీణ వికాస సేవ సమితి ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్