ప్రాంతీయం

ర్యాగింగ్, గొడవలకు పాల్పడడం చట్టరిత్యా నేరం – మంచిర్యాల ఏసిపి

138 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*ర్యాగింగ్, గొడవలకు పాల్పడడం అనేది చట్టరిత్యా నేరం*

*చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, అనవసరం గా భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు*

*ఉత్తమ డాక్టర్లు గా ఎదిగి జిల్లా మెడికల్ కళాశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్*

ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాలలోని మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఆర్ ప్రకాష్  ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మెడికల్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ర్యాగింగ్, గొడవలకు పాల్పడడం అనేది చట్టరిత్యా నేరం, ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడినట్లైతే శిక్షార్హులు అవుతారన్నారు. కొంత మంది విద్యార్ధులు ర్యాగింగ్ చేస్తూ, దాడులు చేస్తూ ఇతర విద్యార్ధులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే
అన్నారు. గంజాయి, గుట్కా, సిగరెట్ వంటి ఇతర మత్తు పదార్ధాలకు బానిసలైతే, మత్తులో జీవితాలు చిత్తు అవుతాయన్నారు. విద్యార్ధిని, విద్యార్థులు మొదటగా చదువు పై దృష్టి సారించాలని, అనవసర సరదాలకు పోయి, కష్టాలను కొని తెచ్చుకోవద్దన్నారు. మీ తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కష్టపడి చదివి భవిష్యత్తులో ఉత్తమ డాక్టర్లుగా ఎదగాలని సూచించారు. ర్యాగింగ్, ఈవ్ టీసింగ్, గంజాయి వంటి ఇతర మాదకద్రవ్యాల జోలికి వెళ్ళి చట్టం ముందు నేరస్థులుగా నిలుబడవద్దన్నారు. విద్యార్థులు నూతన చట్టాల గురించి అవగాహన కలిగి, చట్టాలకు లోబడి ఉండాలని మెడికోలకు సూచించారు. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే డయాల్ 100 కు, స్థానిక పోలీస్ వారికీ పిర్యాదు చేయాలని, వెంటనే స్పందిస్తామని విద్యార్థులుకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సులేమాన్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్ ఐ లు సనత్, ప్రవీణ్, మెడికల్ కళాశాల ప్రొఫెసర్స్, విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్