కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి మల్యాల జాన్సన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ సంక్షేమం,ప్రజాస్వామ్యం, మతసామరస్యం, సామాజిక న్యాయం, కోసం సిపిఐఎం చేపడుతున్న జన చైతన్య యాత్రకు తాము మద్దతు తెలుపుతున్నామని జన చైతన్య యాత్రకు కొనరావుపేట మండల ప్రజలందరూ తరలివచ్చి యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అమాయకపు ప్రజలను బలి చేస్తూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న బిజెపి పతనం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు డప్పుల జలంధర్, మహేష్, సుతారి రాజయ్య,రాజు, మల్యాల ప్రసాద్, మనోజ్, దినకర్, తదితరులు పాల్గొన్నారు.
