వస్తావా ప్రతినిది వెంకటరెడ్డి మార్చి 24, ఆయుష్మాన్ భారత్.. అందరికీ ఆరోగ్య భీమా
రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి. ఈ నెల 31 వరకు ఈ కేవైసీకి అవకాశం
భారత్ ఆరోగ్యశ్రీ పథకం కింద తెల్లరేషన్ కార్డు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) కలిగిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల వరకు కార్పోరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రం లోని ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చులు ఇచ్చేవారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ విలీనంతో మరో రూ.3 లక్షల వరకు లాభం చేకూరనుంది. ఆహార భద్రతా కార్డు నెంబర్ తో ఆయుష్మాన్ భారత్ కు అనుసంధానం చేస్తారు.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఉచిత వైద్య సేవలు పొందడానికి అనుకూలంగా పొందుపరిచారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా కార్డులు అందజేస్తారు. దీంతో ఈ పథకం ద్వారా 1665 రకాల వ్యాధులకు చికిత్స చేయనున్నారు. ప్రధానంగా మోకాలు చిప్ప మార్పిడి, కిడ్నీ, గుండె మార్పిడి, కాలేయ వ్యాధులతో పాటు చాలా రకాల వ్యాధులకు శస్త్ర చికిత్సలు చేసుకునే వీలు కల్పించారు. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కార్డు పొందేందుకు అర్హులు. ఈ నెల 31 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రత్యేక కేంద్రం వద్ద ఆరోగ్య మిత్ర, ఆరోగ్యశ్రీ సిబ్బంది అందుబాటులో ఉంటారు.
ఆయుష్మాన్ భారత్ కార్డును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
సిఎస్సి జిల్లా మేనేజర్ అరుణ్ బాబు..
“ఆయుష్మాన్ భారత్” కార్డును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిఎస్సి మేనేజర్ అరుణ్ బాబు అన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో జిల్లాలో దాదాపుగా 4 లక్షల 30 వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. లబ్ధిదారుల నమోదు కోసం జిల్లాలో 240 సీఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదు కోసం ఈనెల 31 వరకు గడువు ఉందని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ కార్డుతో దేశంలో ఎక్కడైనా వైద్యం చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆయుష్మాన్ భారత్ కార్డును నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు ప్రక్రియ కోసం రేషన్ కార్డుతో కామన్ సర్వీస్ సెంటర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. రేషన్ కార్డు నంబర్, మొబైల్ ఓటీపీతో సమోదు చేస్తున్నామని తెలిపారు. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా వేలిముద్ర బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నామని తెలిపారు
సిఎస్సి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు.
సీఎస్సీ సెంటర్ నిర్వాహకుడు కట్కూరి పరమేష్…
కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సీ) ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నామని సిఎస్సి నిర్వాహకుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖవేశపెట్టిన “ఆయుష్మాన్ భారత్ కార్డులను ప్రజలు సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకొని లబ్ది పొందాలని అన్నారు. గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ పేరుతో కొందరు క్యాంపులు నిర్వహిస్తున్నారని అలాంటి వారిని నమ్మి గ్రామ ప్రజలు మోసపోవద్దని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు మీ గ్రామాల్లోనే సిఎస్సీ సెంటర్లు పనిచేస్తున్నాయని, ఎలాంటి సేవలనయినా సిఎస్సి సెంటర్ ద్వారా ప్రజలు పొందవచ్చు అని పేర్కొన్నారు.
