ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి గ్రామ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో పసిపిల్లకు పెద్దలకు కుక్కల బెడద తో భయం పట్టుకుంది కుక్క చేసిన గాట్లకు గాయపడిన వారి పేర్లు దడిగల హర్షవర్ధన్ రెడ్డి, దడిగల వెంకటరెడ్డి, బోమ్మడి లచ్చవ్వ, కొత్తపల్లి సత్తిష్, కొత్తపల్లి దేవరాజు, కొత్తపల్లి నాగరాజు,
15 మంది గాయాలపాలయ్యారు గ్రామస్తులంతా కలిసి కుక్కను చంపేశారు గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఆ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏరియా ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు కుక్కల బెడదతో ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బాధితులు పేర్కొంటున్నారు ఇకనైనా పాలకవర్గం చర్యలు తీసుకొని పిచ్చికుక్కలను గ్రామం నుండి తరలించాలని కోరుతున్నారు




