శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో భద్రాచల సీతారాముల కల్యాణం వాల్ పోస్టర్స్, కరపత్రాలు ఆవిష్కరణ. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈనెల 30వ తేదీన భద్రాచల దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణం 12ఏళ్లకోసారి జరిగే వసంత పక్ష పుష్ప రథోత్సవములకు సంధించిన వాల్ పోస్టర్స్, కర పత్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శుక్రవారంనాడు కిరాణ వర్తక సంఘంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ భారతావనిలో అతి ప్రసిద్ధి గాంచిన శ్రీరామ క్షేత్రం భద్రాచలం. భద్రుని కోర్కెపై పవిత్రగోదావరి తీరమైన ఈ పుణ్యక్షేత్రమునకు భద్రాచలమని పేరు వచ్చిందన్నారు. భద్రాచల దేవస్థానం వారు రామకోటి సంస్థకు ఇలాంటి అవకాశాలు కల్పించడం సంతోషమన్నారు.
ఈ కార్యక్రమంలో కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ధి భిక్షపతి, సెక్రెటరీ మెట్రాములు, చిగుల్లపల్లి యాదగిరి, మర్యాల శ్రీను, కాపర్తి వైకుంఠం, నంగునూరి సత్యనారాయణ, దూబకుంట లచ్చలు, దూబకుంట ప్రభాకర్, అత్తెల్లి లక్ష్మయ్య, దొంతుల సత్యనారాయణ, మర్యాల లింగం, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.