*కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలు చేయడంలో పూర్తిగా విఫలం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి*
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిన ఎన్నికల సమయంలో ఇచ్చిక్ 6 గ్యారెంటీల హామీలను 100 నెరవేరుస్తామని ఇప్పటి వరకు హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని హామీల అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందటంతో ప్రజల్లో విశ్వాసం కోపోయిందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఆరు నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను అమలు చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అవడంతో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది అని అన్నారు. ఆరు గ్యారంటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలు, యువత, మహిళలను, రైతులను మోసం చేసింది. రైతులకు 2 లక్షల రూపాయలు రుణ మాఫీ, రైతు భరోసా ఎకరానికి 15 వేల రూపాయలు, మహిళలకు 2500 రూపాయలు, వృద్దులకు 4వేల రూపాయల పెన్షన్, యువతకు 5 లక్షల రూపాయలు విద్య భరోసా కార్డు, నిరుద్యోగులకు 4వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటి గ్యారెంటీల అమలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు.
మరొకపైపు స్థానిక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల అసెంబ్లీ లో అవినీతి, గుండాయిజం, రౌండియిజం తో అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు కాలి జాగ కనిపిస్తే అక్కడ ఎమ్మెల్యే అండతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు గెలిచాక 100 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇప్పిస్త అని చెప్పి ఎల్లంపల్లి బాధితులను మోసం చేశారు అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో బాగంగా రాళ్లవాగు కరకట్ట నిర్మాణం ఏమైందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్ళీ వర్ష కాలం ప్రారంభం అవడంతో రాళ్ళ వాగు పరివాహక ప్రాంత ప్రజలు మళ్ళీ ఎక్కడ వరదలు వస్థాయో అని భయ బ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి పై మంచిర్యాల – అంతార్గం మధ్య వంతెన మంజూరు చేసి 5 ఏండ్లు కాలయాపన చేసి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తన స్వలాభం కోసమే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల – అంతర్గాం గోదావరి వంతెన ను నిర్మించకుండా మరో చోటుకు తరలించేందుకు సిద్ధం అయ్యారని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అరాచకాలను మరియు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మోసాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు బిజెపి పోరాటం చేస్తూనే ఉంటుందని అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల స్ఫూర్తితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీల్లో మరియు గ్రామాల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, జోగుల శ్రీదేవి, బోద్దున మల్లేష్, బొలిషెట్టి అశ్విన్, బోయినీ హారి కృష్ణ, రెడ్డిమల్ల అశోక్, రాకేష్ రేన్వా, పల్లి రాకేష్, బింగి ప్రవీణ్, కమలాకర్ రావు, వాణి శ్రీ, ఆకుల సంతోష్, అరెందుల శ్రీనివాస్, అర్ణకొండ శ్రీనివాస్, స్వాతి మరియు తదితరులు పాల్గొన్నారు.





