కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లోని ధర్మారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గున్నాల అరుణ లక్ష్మణ్, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, కలిసి ప్రారంభించారు. గ్రామ ప్రజలందరూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం బుజ్జి, ఆరోగ్య సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
