వర్గల్ మండల్ అక్టోబర్ 30:
సీఎం ప్రాథినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచ్‌లుగా ఉండటం మా అదృష్టం, ఇక్కడ సీఎం ఉండటం వలన మా గ్రామాలు ఎంతగానో అభివృద్ది చెందాయి, ఆయన మళ్లీ ఇక్కడ నుంచి పోటీచేస్తుండటంతో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి ఆయన రుణం తీర్చుకోవటానికి మాకు అవకాశం దక్కింది. ఇందు కోసం మండల సర్పంచులమంతా కలసికట్టుగా మంత్రి హరీష్‌రావు, ఎఫ్డీసీ చైర్మెన్ ప్రతాప్‌రెడ్డి గార్ల నేతృత్వంలో కష్టపడి పనిచేసి కేసీఆర్తరపున ప్రచారంచేస్తాము.
ఈ విషయమై మేము ఆదివారం రోజు సమావేశమై కేసీఆర్ గెలుపు కోసం చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించాము. కానీ కొందరు మేము పార్టీ మారటానికి సమావేశమైనట్టు తప్పుడు ప్రచారం చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేమంతా బీఆర్ఎస్ పార్టీకి విధేయులం, మేము సీఎం కేసీఆర్ నేతృత్వంలో 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసుకునే ఆవశకాం దక్కింది . ఇప్పుడు ఆయన పోటీలో ఉండటంతో ఆయనను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపంచటానికి మాకు చక్కటి అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని ఇయన విజయానికి కృషి చేస్తాము.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలలో ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేసింది. గ్రామాలలో ఈ పథకాల లబ్ధిదారులు లేని ఇళ్లే లేదు. అందుకే ప్రతీ ఇంటికి తిరిగి కేసీఆర్ చేసిన అభివృద్దిని వివరించి కేసీఆర్‌కు ఓటు వేసేలా చూస్తాము.
మళ్లీ కేసీఆర్ నుంచి లక్షకు పైగా మెజార్టీతో గెలిపించుకుని మళ్లీ ఆయనను సీఎంగా చూడాలన్నదే మా సర్పంచుల సంకల్పం.
స్వతంత్రం వచ్చిన 65 సంవత్సరాలలో గ్రామాలలో జరగని అభివృద్ది కేసీఆర్ సీఎం అయ్యాక కేవలం 10 ససంవత్సరాలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయి.
ప్రజలకు తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు తదితర మెరుగైన మౌళిక వసతులు గ్రామాలలో సమకూరాయి.
ప్రస్తుతం గజ్వేల్ నియోజకర్గంలో గ్రామాలు కూడా పట్టణాలకు దీటుగా అభివృద్ది చెందాయి.
వర్గల్ మండల సర్పంచ్ ఫోరం, సర్పంచ్‌లు