Breaking News

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

129 Views

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

తెలంగాణ ప్రాంత భక్తులను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ వారణాసి , శబరిమలలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన సకల వసతులతో భవన నిర్మాణాల ఏర్పాటుకు ముందుకు రావడం హర్షనీయమని పేర్కొంటూ వర్గల్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు . వారణాసితోపాటు శబరిమలలో రూ 25 కోట్ల చొప్పున కేటాయిస్తూ
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు వేలూరి వెంకట్ రెడ్డి , ఫ్యాక్స్ చైర్మన్ రామకృష్ణారెడ్డి , అయ్యప్ప సేవా సమితి నేతలు డాక్టర్ గణేష్ , పైనo వెంకటేష్ లు పేర్కొన్నారు . తెలంగాణ ప్రాంతం నుండి ప్రతి సంవత్సరం కోటి మంది అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుoటారని , అయితే అక్కడ కనీస వసతులు కరువై ఇబ్బందులు పడుతున్న క్రమంలో అయ్యప్పల సమస్యలను దృష్టిలో పెట్టుకొని మంచి మనసుతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆయనపై స్వామి వారి కరుణాకటాక్షాలు , కాశి విశ్వేశ్వరుని దీవెనలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో నేతలు స్వామి , దిలీప్ గౌడ్ , మహేష్ యాదవ్ పాల్గొన్నారు .

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *