రైతులు ప్రత్యామ్నాయ పంట గా ఆయిల్ పామ్ ను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కె.శివ ప్రసాద్ సూచించారు. వర్గల్ మండలం లో ని వర్గల్, చౌదర్పల్లి గ్రామాల లో క్షేత్ర స్థాయి లో ఆయిల్ పామ్ పంటను పరిశీలించారు. సాగు యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం తదితర అంశాలను గురించి రైతులకి వివరించారు. ఆయిల్ పామ్ పంటలో మొదటి మూడు సంవత్సరాల వరకు అన్ని రకాల కూరగాయలు , అపరాలు , మొక్కజొన్న తదితర పంటలను అంతరపంటలుగా వేసుకోవచ్చని తెలిపారు. మండల వ్యాప్తం గా 176 ఎకరాలు సాగు చేస్తునట్టు తెలిపారు. ఈ కార్య క్రమం లో జడ్పీటీసీ బాలు యాదవ్, రైతులు బాలిరెడ్డి , ఏ ఈ ఓ లు భారతి , క్రాంతి తదితరులు పాల్గొన్నారు.




