కోనరావుపేట/ రిపోర్టర్ డి.కరుణాకర్/ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పొట్లపల్లి అశ్రిత అను నిరుపేద విద్యార్థిని తన బి టెక్ 3వ సంవత్సరం విద్యకై ( అకాడమిక్ ఫీజు) ఆర్థిక సహాయం కావాలని డాక్టర్ చెన్నమనేని వికాస్ ను అడగగా వారు సానుకూలంగా స్పందించి నిరుపేదలైన విద్యార్థులకి ఉన్నత విద్య అభ్యసించడం కొసం ప్రతిమ ఫౌండేషన్ ముందుంటుందని అన్నారు. మామిడిపల్లి గ్రామంలో నిర్వహించిన హెల్త్ క్యాంపులో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా 25,000 ఆర్థిక సహాయం పొట్లపల్లి అశ్రితకి అందించారు. గోపాడి సురేందర్రావు, మిరియాల్ కార్ బాలాజీ, గున్నాల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
