ఎన్నికల్లో భాగంగా న్యాయవాదుల సంపూర్ణ మద్దతు కేటీఆర్ కెనని సీనియర్ న్యాయవాది తంగళ్ళపల్లి వెంకటి తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేటీఆర్ ని ఈ ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించాలని అన్నారు. న్యాయవాదుల సంక్షేమ కృషికి అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పథంలో మందుకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు బోద్దుల. రాజేష్, కిషోర్, కడగండ్ల తిరుపతి, సుమన్, శ్రీనివాస్, శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
