చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 24 :
- అందరి అభ్యూన్నతికోసం మున్నూరుకాపుల అబివృద్దికోసం పని చేస్తానని టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య అన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరుకాపుల సంఘం జిల్లా అద్యక్షులు దుమాల శ్రీ కాంత్ పటేల్ ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలోనీ మున్నూరుకాపు సంఘం కళ్యాణ మండపంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య కు ఆత్మీయ సన్మానసభ ఏర్పాటు చేసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన మున్నూరుకాపు శ్రేణులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ,
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కన్వీనర్ పుటం పురుషోత్తమ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అండదండలతో రాష్ట్ర రాజదానిలో రాష్ట్రంలో ఏ కుల సంఘం నిర్మించని విధంగా ఎం కె టవర్ ను నిర్మించనున్నట్లు తెలిపారు ,
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర మున్నూరుకాపు సత్రం అద్యక్షులు కొండ దేవయ్య మాట్లాడుతూ మున్నూరుకాపు విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాట్లు చేయడానికి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ద్వారా నిందులు ఇప్పించాలని తోట ఆగయ్య ను కోరారు ,జిల్లాలో అన్ని కమీటి లను పూర్తి చేసినందుకు జిల్లా అద్యక్షులు దుమాల శ్రీ కాంత్ ను రాష్ట్ర నాయకులు బోనాల రవిశంకర్ అబినందించారు , అదేవిధంగా 15 రోజుల వరకు మహిళా కమీటీ ని , రైతు కమీటి లను పూర్తి చేయాలని జిల్లా కమీటీ ని ఆదేశించారు, అన్నీ కుల సంఘాల జిల్లా భవనాలను స్థాలలు ,నిధులు ఇస్తున్నట్టు మన మున్నూరుకాపు సంఘానికి స్థలం నిధులు ఇప్పించాలని సమావేశం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కి తోట ఆగయ్య కు విజ్ఞప్తి చేసింది,
జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర సంఘం కన్వీనర్ లక్ష్మన్ , తంగళపెల్లి మండల పరిషత్ అద్యక్షురాలు పావని రాజు , జిల్లా నాయకులు నంది కిషన్ , మీసం రాజం ,మెంగిని మనోహర్ , కుక్కల దేవేందర్ , లక్ష్మన్ ,తిరుపతి ,ఆకుల సత్యం , వివిధ మండల శాఖ ల అద్యక్షులు వేదిక పై అశీనులయ్యారు ,
ఈ సమావేశంలో సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు రాజు ,కృష్ణ .ముకాస ప్రతినిధులు నంది శంకర్ ,శెట్టి వెంకటయ్య ,బండి వెంకటయ్య. దబ్బెడి రాములు , బండారి బాల్ రెడ్డి, జిల్లా నలుమూలల నుండి వివిధ గ్రామశాఖల అద్యక్షులు ,కార్యదర్శులు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు ,iyo