ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి13, రాత్రి సమయంలో ముస్తాబాద్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద బోరుబావుల యొక్క కరెంటు వైర్లను గుర్తు తెలియని దొంగలు కట్ చేసి దొంగతనం చేసినారని ముస్తాబాద్ గ్రామానికి చెందిన బండారి యాదగిరి తండ్రి పెంటయ్య సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినామని అతనితోపాటు మరో 18, మంది రైతుల యొక్క కరెంటువైర్ లను కూడా కట్ చేసి ఎత్తుకెళ్లారని తెలుపగా రైతులు వారి బోరు మోటార్లను రాత్రి సమయంలో గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు రైతులకు పలు సూచనలు ఇచ్చామని తెలిపారు.
