ప్రాంతీయం

మనుస్మృతి భావాలనూ తగలబెట్టాలి

135 Views

మనదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండే మనుస్మృతి అనే చట్టం గద్దె దిగాలి అని మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి అన్నారు ,అంబేద్కర్ సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఏలేశ్వరం మహేష్ అది తలల్లోకి ఎక్కించారాయె అంత సులభంగా ఎలా దిగుతుంది! రాజ్యాంగాన్ని ఆమోదించిన రాజ్యాంగ సభలోనూ మనుస్మృతి కొనసాగాలని బలంగా కోరుకొనేవారు ఉన్నారు. కోర్టులు, ప్రభుత్వ వ్యవహారాలు ఎలా ఉన్నా సమాజంలో అదే చెలామణి కావాలనుకొనే వారికి రాజ్యాంగ సభలో కొదవలేదు. అలాంటి బాపతులున్నారు కనుకనే మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించే బిల్లును న్యాయశాఖ మంత్రిగా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రవేశపెట్టినప్పుడు ప్రముఖ నాయకులంతా దాన్ని వ్యతిరేకించారు. ఫలితంగా అంబేద్కర్‌ మంత్రి పదవిని త్యజించి చట్టసభల వెలుపల తన సామాజిక పోరాటాన్ని కొనసాగించారు.
స్వాతంత్య్రానికి ముందు ముస్లింల పాలనలోనూ క్రైస్తవ ఆంగ్లేయుల పాలనలోనూ మనుస్మృతే రాజ్యమేలింది. మనుస్మృతి శూద్రులకు, మహిళలకు కనీస మానవ హక్కులను నిరాకరిస్తుంది
మనుస్మృతిని విమర్శిస్తే గింజుకొనే వారు ఇప్పటికీ మన మధ్య ఉన్నారు. హిందువులం కనుక మనుస్మృతిలోని ఆచారాలను, ఆంక్షలను పాటించడం తప్పదని అనుకొంటారు. వర్ణం, కులం, మహిళలపై మనుస్మృతి విధించిన ఆంక్షలకు, 1950 నుండి మన దేశంలో అమల్లోకి వచ్చిన రాజ్యాంగానికి పొత్తు కుదరదు. రాజ్యాంగం ఆధునికమైంది. మెజారిటీ ప్రజలకు మేలు చేసేది. మనుస్మృతి వారికి హాని కల్గించేది. అది జన బాహుళ్యాన్ని నిస్తేజితులను చేస్తుంది. కర్మగా భావించి సరిపెట్టుకొమ్మంటుంది. కొందరు బ్రాహ్మణులు తమ స్వీయ ప్రయోజనం కోసం రాసుకొని మొత్తం సమాజంపై రుద్దిన చట్టం మనుస్మృతి. స్మృతి ఆరంభంలోనే అనేక అంతరాలతో సమాజం ఉండాలని, బహు సంఖ్యాక శ్రమజీవులపై అల్పసంఖ్యాక పరాన్నజీవుల పెత్తనాన్ని రుద్దడం ఎలా అన్నదే మనుధర్మ శాస్త్రం సారాంశమని దాని రెండవ శ్లోకంలో స్పష్టమవుతుంది.
మనుస్మృతి తమను ఎంత దిగజార్చిందో దళితులు గమనించినంతగా, మహిళలు ఇతర శూద్రులు గమనించక పోవడం వల్ల మనుస్మృతిని పాడెనెక్కించే పోరాటం నేడు చాలా వరకు దళితులకే పరిమితమై ఉంది. వేల ఏళ్ల పాటు మనదేశంలో చెలామణి అయిన ఈ రాకాసి చట్టం ‘వదల బొమ్మాళి వదల’ అన్నట్లు నేటికీ మన సమాజాన్ని వెంటాడుతూనే ఉంది. మనుస్మృతి ఒక కాలంలో ఒక వ్యక్తి రాసింది కాదు. దాదాపు 400 ఏండ్ల పాటు పండితులు తమ అంచనాలను, అవసరాలను అందులో జొప్పించారు. మనకు ఇప్పుడు చట్టసభలు ఆమోదించిన చట్టాలున్నాయి. వాటికి సవరణలు జరుగు తుంటాయి. అది ప్రజాస్వామిక పద్ధతి. కాని ఇప్పుడు అవేవీ పాటించకుండా కేంద్రంలోని ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మందబలంతో చట్టాలను సవరిస్తున్నాయి. కొత్త చట్టాలను ఆమోదించుకొంటున్నాయి. అలా చేయడం వల్ల మరణించాల్సిన మనుస్మృతిని తిరిగి బతికించడమే అవుతుంది. ప్రజాస్వామ్యం పేర అప్రజాస్వామిక మనుస్మృతి ఎలా చెలామణి అవుతుందని చెప్పడానికి అది కూడా ఒక ఉదాహరణ.*
*మనుషులను నాలుగు వర్ణాలుగా దేవుడే విభజించినట్లు మనువు చెప్పాడట. నాలుగింటిలో బ్రాహ్మణుడు అందరికంటే పై నుంటాడు. శూద్రులు అట్టడుగున ఉంటారు. మనుస్మృతి ప్రకారం శిక్షలు కూడా వర్ణ ప్రాతిపదికపైనే ఉంటాయి. ఇప్పుడు శిక్ష వేయడం మనుస్మృతి ప్రాతిపదిక కాకున్నా జైల్లో శిక్ష అమలు కులం ప్రాతిపదికగానే ఉంటుందని వింటాం మనం. భర్త చోరుడైనా, జారుడైనా, రోగిష్టి అయినా ఎలాంటి వాడైనా అతనికి భార్య సేవలు చేయాలని, అతన్ని వదిలి పెట్టరాదని మనుస్మృతి శాసిస్తుంది. మగ సంతు లేకపోతే మగవాడికి మరో పెళ్లి చేసుకొనే అవకాశం ఇస్తుంది. అలాంటి అనుమతి మహిళకు లేదు. ఇప్పుడు అధికారికంగా రెండో పెళ్లికి అనుమతి తేలికగా దొరకక పోయినా ఆడ శిశవును కడుపులో ఉన్న దశలోనే హత్య చేస్తున్నారు. ఇలా సర్వ అనర్ధాలకు కారణమైన మనుస్మృతినీ, దాని భావనలను అంబేద్కర్‌ స్ఫూర్తితో తగలబెట్టాలి. ఈ కార్యక్రమంలో మన్నె కృష్ణ మహేష్ నరేష్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7