గజ్వేల్ పట్టణంలో ఏ జెడ్ ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ జుబేర్ పాషా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు తేదీ 12.8.2023 ప్రారంభమవుచున్నవి.ఈ కబడ్డీ క్రీడోత్సవాలు రెండు రోజులపాటు జరుగుతాయని,స్థలం ఐఓసీ కార్యాలయం వెనుక క్రీడామైదానంలో మహిళలకు,పురుషులకు వేరువేరుగా పోటీలు జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే శివకుమార్ తెలిపారు.ఈ కబడ్డీ పోటీలలో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి గా 20000,రెండవ బహుమతి గా 10000,తృతీయ బహుమతి 5000,ట్రోఫీలు మహిళలకు పురుషులకు వేరువేరుగా అందజేస్తామని పేర్కొన్నారు.క్రీడలలో పాల్గొనే ఆసక్తి గలవారు తమ జట్ల వివరాలను 7207110466 ఎండి అజార్,9441515150,ఎల్ రాజు,9502290793 బి భాస్కర్ గార్లకు ఫోన్ చేసి తమ జట్ల వివరాలను అందించగలరని పేర్కొన్నారు.
