ముస్తాబాద్, జూలై 10 (24/7న్యూస్ ప్రతినిధి): రాష్ట్ర సీనియర్ నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి తెలంగాణ రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి బుధవారము రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన నివాసంలో గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చక్కరధర్ రెడ్డి మాట్లాడుతూ కేకే మహేందర్ అన్న సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్న వాటన్నింటిని అధిగమించి ప్రజల గుండెల్లో నిలిచి అంకిత భావంతో ప్రజాసేవచేస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు.
