అన్నా అంటే నేనున్నానంటూ స్పందించే మానవతా మూర్తి, కష్టంలో ఉన్నారని తెలిస్తే రెక్కలు కట్టుకొని వాలిపోయే సేవ స్ఫూర్తి, తర తమ భేదం లేకుండా సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న దయామయుడు, ఆడబిడ్డ వివాహం చేయడానికి ఓ కుటుంబం ఇబ్బందులు పడుతుందని విషయం తెలియగానే తనవంతు స్వయంగా చేదోడువాదోడుగా నిలిచి ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. సూరంపల్లి గ్రామానికి చెందిన లింగం లత కూతురు ననీత వివాహానికి పుస్తేమట్టలు అందజేసి పెళ్లి పెద్దగా నిలిచాడు. మానవత్వం కలగలిసిన రూపం ఉమ్మడి మండల ప్రజలకు దొరకడం ఒక వరం, సాయం ఏదైనా స్పందించే హృదయం, ఉమ్మడి మండలంలో మీ పరిచయం లేని వారు లేరు అన్నది ఎంతో నిజం. మీ సేవలు ఇలాగే కొనసాగాలి నిత్యం రాజకీయ రంగంలో ఎత్తుకు ఎదగాలి. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ యాదవ్ రెడ్డి, సూరంపల్లి సర్పంచ్ నర్సింలు, మాజీ ఎంపీటీసీ సత్యం, వెంకట్ బొల్లం స్వామి, మస్తాన్ పఠాన్, ఏంకొల్ల రాజు, ఏ ఏం సి డైరెక్టర్ వెంకన్న చంద్రారెడ్డి, బాలయ్య, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
